నడక నేర్పే తల్లి నీవే,
వృద్ధి నిచ్చే తండ్రి నీవే,
జీవితంలో నొసట యందు రాత రాసే భ్రంహ నీవే.
వెలుగునిచ్చే కాంతి నీవే,
ప్రజల్లోని బ్రాంతి నీవే,
దేశమందు, లోకమందు పెంచాల్సిన శాంతి నీవే.
పైకి తెచ్చే యువత నీవే,
మనసులోనీ మమత నీవే,
భూమియందు జీవరాసుల బాధ తెలిపే వ్యాఖ్యాత నీవే.
తుదిపోరుకి సిద్దం అవుతూ ,
ప్రపంచానికి జ్ఞానం ఇస్తూ,
లక్ష్య సాధనకి స్ఫూర్తి నిచ్చి,
వృత్తి గౌరవం నిలబెట్టిన , ఓ ఉపాధ్యాయుల్లరా!
వంధనం, వంధనం, పేరు పేరున వంధనం.
Wednesday, August 26, 2009
Thursday, August 6, 2009
స్వాతంత్ర్యం
పేద వాడికి అన్నం లేక,
దున్నే వాడికి భూమి లేక,
రోజు రోజుకీ పస్తులు పెరిగితే,
ఎవరికి స్వాతంత్ర్యం ఇంకెవరికి స్వాతంత్ర్యం.
హిందువునేమో ముస్లిం కొట్టె,
ముస్లింనేమో హిందువు కొట్టె,
కులం పేరుతో గొడవలు రేగితే,
ఎందుకు స్వాతంత్ర్యం ఇంకెందుకు స్వాతంత్ర్యం.
పల్లె ప్రజలే పట్నం వెళ్ళే,
పల్లెటూరులో చీకటి పెరిగే,
రాజకీయమే పరుగులు పెడితే,
ఎవరికి స్వాతంత్ర్యం, ఇంకెవరికి స్వాతంత్ర్యం.

ప్రేమ అందం
పింఛం విప్పితే నెమలికి అందం,
కూత కూస్తే కోయిలకి అందం,
పరిమళం ఉంటే పూవుకి అందం,
ప్రేమని పొందితే సర్వం అందం.
కూత కూస్తే కోయిలకి అందం,
పరిమళం ఉంటే పూవుకి అందం,
ప్రేమని పొందితే సర్వం అందం.
Wednesday, August 5, 2009
పిచ్చి ప్రేమ
ఘండ్రు గొడ్డలిని వెంటతేచ్చి, గావు కేకలే పెట్టిస్తే,
ప్రాణం కోసం గజ గజ వణికే మగువ నిన్ను మెచ్చేనా?
ప్రేమిస్తావా? నువ్వు చస్తావా? అని ఆసిడ్ బాటిల్ చూపిస్తే?
దిక్కు లేని ఆ ఆడపిల్లకి మిగిలింది ఇక చావేనా?
ప్రేమకి పగకి తేడా తెలియక అహంకారమే గర్జిస్తే,
అడపడచుకి స్వేచ్చనిచ్చే బాపూ కల నెరవేరేనా?
జన్మనిచ్చినా తల్లిదండ్రులే, మా కొడుకే కాదని ఛీ కొడితే,
కన్న ప్రేమకి నోచుకోనీ నీదీ ఒక బ్రతుకేనా?
ఆలోచించని అహంకారం ఇప్పటికైనా మారేనా?

ప్రేమ పువ్వు
పూవు పూసింది నీ కోసం,
పరిమళించింది నీ కోసం,
ఆ పరిమళం వాడిపోకముందే,
తుంచి తెచ్చింది నీ కోసం.
ఓ ప్రియతమా!
ఈ అందమైన పూవు
నీ సొగసైన జడలో ధరించుమా నా కోసం.
పరిమళించింది నీ కోసం,
ఆ పరిమళం వాడిపోకముందే,
తుంచి తెచ్చింది నీ కోసం.
ఓ ప్రియతమా!
ఈ అందమైన పూవు
నీ సొగసైన జడలో ధరించుమా నా కోసం.
త్సునామి
త్సునామీగా ఆగ్రహించిన జలాంతర్గ ప్రళయంలో,
అలరించిన అలలన్నీ ఒక్కసారిగా తాండవిస్తే,
అలల పోరుకి తట్టుకోక, జలశక్తిని ఆపలేక,
నీరుగారిన ప్రజలేందరో ప్రాణాలే జారవిడిచే.
కపటమెరుగని పసిపిల్లలు కనుమరుగై కానరారే.
ఎటు చూసిన ఆర్తనాదం, తరిగిపోని శవప్రవాహం,
జల ప్రలయపు చావురాక, బ్రతుకు నిలిచిన కొద్ది ప్రజలకు
మిగిలిలేదే అణువు రూపం. తిరిగి రాదే ఆత్మబంధం.
గూడులేక, గుడ్డలేక, పొట్టకూటికి తిండిలేక,
తోటిప్రజల సహాయార్థం చేతులేత్తిన పేదప్రజల
ఆశ్రుబిందువులనాపగలమా? చిరునవ్వు చిందించగలమా?

మాతృ భాష
కేవ్వుమన్న శిశువు కేక,
నేర్చేదీ మాతృ భాష,
ముందునేర్చిన నీ బాష మాట్లాడవెందుకింక?
ఆంగ్ల భాష వచ్చాక,
మాతృ భాష గుర్తురాక,
వచ్చి రానీ ఆంగ్లంతో కుప్పిగంతులెందుకింక ?
నేర్చేదీ మాతృ భాష,
ముందునేర్చిన నీ బాష మాట్లాడవెందుకింక?
ఆంగ్ల భాష వచ్చాక,
మాతృ భాష గుర్తురాక,
వచ్చి రానీ ఆంగ్లంతో కుప్పిగంతులెందుకింక ?
Subscribe to:
Comments (Atom)