Wednesday, August 26, 2009

ఉపాద్యాయుడు

నడక నేర్పే తల్లి నీవే,
వృద్ధి నిచ్చే తండ్రి నీవే,
జీవితంలో నొసట యందు రాత రాసే భ్రంహ నీవే.
వెలుగునిచ్చే కాంతి నీవే,
ప్రజల్లోని బ్రాంతి నీవే,
దేశమందు, లోకమందు పెంచాల్సిన శాంతి నీవే.
పైకి తెచ్చే యువత నీవే,
మనసులోనీ మమత నీవే,
భూమియందు జీవరాసుల బాధ తెలిపే వ్యాఖ్యాత నీవే.
తుదిపోరుకి సిద్దం అవుతూ ,
ప్రపంచానికి జ్ఞానం ఇస్తూ,
లక్ష్య సాధనకి స్ఫూర్తి నిచ్చి,
వృత్తి గౌరవం నిలబెట్టిన , ఓ ఉపాధ్యాయుల్లరా!
వంధనం, వంధనం, పేరు పేరున వంధనం.

No comments:

Post a Comment