త్సునామీగా ఆగ్రహించిన జలాంతర్గ ప్రళయంలో,
అలరించిన అలలన్నీ ఒక్కసారిగా తాండవిస్తే,
అలల పోరుకి తట్టుకోక, జలశక్తిని ఆపలేక,
నీరుగారిన ప్రజలేందరో ప్రాణాలే జారవిడిచే.
కపటమెరుగని పసిపిల్లలు కనుమరుగై కానరారే.
ఎటు చూసిన ఆర్తనాదం, తరిగిపోని శవప్రవాహం,
జల ప్రలయపు చావురాక, బ్రతుకు నిలిచిన కొద్ది ప్రజలకు
మిగిలిలేదే అణువు రూపం. తిరిగి రాదే ఆత్మబంధం.
గూడులేక, గుడ్డలేక, పొట్టకూటికి తిండిలేక,
తోటిప్రజల సహాయార్థం చేతులేత్తిన పేదప్రజల
ఆశ్రుబిందువులనాపగలమా? చిరునవ్వు చిందించగలమా?
Subscribe to:
Post Comments (Atom)
chala baga rasaru , meekunna bava........, na johar
ReplyDeletethank u
ReplyDelete