Thursday, August 6, 2009

స్వాతంత్ర్యం

పేద వాడికి అన్నం లేక,
దున్నే వాడికి భూమి లేక,
రోజు రోజుకీ పస్తులు పెరిగితే,
ఎవరికి స్వాతంత్ర్యం ఇంకెవరికి స్వాతంత్ర్యం.
హిందువునేమో ముస్లిం కొట్టె,
ముస్లింనేమో హిందువు కొట్టె,
కులం పేరుతో గొడవలు రేగితే,
ఎందుకు స్వాతంత్ర్యం ఇంకెందుకు స్వాతంత్ర్యం.
పల్లె ప్రజలే పట్నం వెళ్ళే,
పల్లెటూరులో చీకటి పెరిగే,
రాజకీయమే పరుగులు పెడితే,
ఎవరికి స్వాతంత్ర్యం, ఇంకెవరికి స్వాతంత్ర్యం.
ఎందుకు స్వాతంత్ర్యం ఇంకెందుకు స్వాతంత్ర్యం.

2 comments: